మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        


Sri Chidambara Ashtakam – శ్రీ చిదంబరాష్టకం

చిత్తజాంతకం చిత్స్వరూపిణం
చంద్రమృగధరం చర్మభీకరమ్ |
చతురభాషణం చిన్మయం గురుం
భజ చిదంబరం భావనాస్థితమ్ || 1 ||

దక్షమర్దనం దైవశాసనం
ద్విజహితే రతం దోషభంజనమ్ |
దుఃఖనాశనం దురితశాసనం
భజ చిదంబరం భావనాస్థితమ్ || 2 ||

బద్ధపంచకం బహులశోభితం
బుధవరైర్నుతం భస్మభూషితమ్ |
భావయుక్‍స్తుతం బంధుభిః స్తుతం
భజ చిదంబరం భావనాస్థితమ్ || 3 ||

దీనతత్పరం దివ్యవచనదం
దీక్షితాపదం దివ్యతేజసమ్ |
దీర్ఘశోభితం దేహతత్త్వదం
భజ చిదంబరం భావనాస్థితమ్ || 4 ||

క్షితితలోద్భవం క్షేమసంభవం
క్షీణమానవం క్షిప్రసద్యవమ్ |
క్షేమదాత్రవం క్షేత్రగౌరవం
భజ చిదంబరం భావనాస్థితమ్ || 5 ||

తక్షభూషణం తత్త్వసాక్షిణం
యక్షసాగణం భిక్షురూపిణమ్ |
భస్మపోషణం వ్యక్తరూపిణం
భజ చిదంబరం భావనాస్థితమ్ || 6 ||

యస్తు జాపికం చిదంబరాష్టకం
పఠతి నిత్యకం పాపహం సుఖమ్ |
కఠినతారకం ఘటకులాధికం
భజ చిదంబరం భావనాస్థితమ్ || 7 ||

ఇతి శ్రీచిదంబరాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.